35 ఓవ‌ర్ల‌లో 200/2…..చివ‌రి 15ఓవ‌ర్ల‌లో 89/5

నచ్చితే షేర్ చేయ్యండి

టీమిండియా నాల్గో వ‌న్డేలో ఘోరంగా త‌డ‌బ‌డింది. బ్యాడ్ వెద‌ర్ జోరుకు బ్రేక్ ఇస్తే, ఆ త‌ర్వాత మ‌నోళ్లు పూర్తి బేజారైపోయారు. ధావ‌న్ దంచికొట్టినా, కోహ్లీ క‌మాల్ ఇన్నింగ్స్ ఆడినా..మిడిలార్డ‌ర్ వైఫ‌ల్యం టీమ్‌ను త‌క్కువ స్కోర్‌కే ప‌రిమితం చేసింది. అంతేకాదు, టీమిండియాను నాల్గో వ‌న్డేలో డిఫెన్స్‌లో ప‌డేసింది. ఇక బౌల‌ర్లు రాణించ‌డంపైనే భార‌త్ విజ‌య‌వ‌కాశాలు ఆధార‌ప‌డి ఉన్నాయి. ఏబీ డివిలియ‌ర్స్ రావ‌డం స‌ఫారీల‌కు కాస్త ఊర‌ట క‌ల్గిస్తున్న విష‌యం. 34.2ఓవ‌ర్ల‌లో 200/ 2 రోహిత్ మ‌రోసారి విఫ‌ల‌మైనా…కోహ్లీ, ధావ‌న్ జోడీ టీమ్ స్కోర్ బోర్డ్‌ను ముందుకు న‌డిపించారు. అస‌లేమాత్రం త‌గ్గ‌కుండా అద‌ర‌గొట్టారు. కోహ్లీ, త‌న‌లోని దూకుడును మ‌రోసారి కొన‌సాగించాడు. 75ప‌రుగులు చేసి పెవిలియ‌న్ చేరిన కోహ్లీ, టీమ్‌ను ప‌టిష్ట‌స్థితిలో నిలిపాడు. ఆ త‌ర్వాత‌… ధావ‌న్ దుమ్మురేపాడు. వందో వ‌న్డేలో వంద ప‌రుగులు చేసి వండ‌ర్ సృష్టించాడు. ఈ టైమ్‌లో…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

HCA ప్ర‌లోభాల‌కు లొంగ‌కుండా టీసీఏ టోర్న‌మెంట్‌

నచ్చితే షేర్ చేయ్యండి

హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ ప్ర‌లోభాల‌కు లొంగ‌కుండా, తెలంగాణ క్రికెట్ అసోసియేష‌న్ ఆల్ స్టార్స్ క్రికెట్ టోర్నీని నిర్వ‌హించింద‌ని ఆ సంస్థ స‌భ్యులు స్ప‌ష్టం చేశారు. ఎల్‌బి స్టేడియం వేదిక‌గా వారం రోజుల పాటు జ‌రిగిన టోర్నీలో మెరుగైన ఆట‌గాళ్లు వెలుగులోకి వ‌చ్చార‌ని, వాళ్లంద‌రి భ‌విష్య‌త్‌కు తాము భ‌రోసాగా ఉంటామ‌న్నారు. సోమాజీగూడ ప్రెస్‌క్ల‌బ్‌లో జ‌రిగిన ప్రెస్‌మీట్‌లో టీసీఏ ప్రెసిడెంట్‌, కార్య‌ద‌ర్శి, భ‌విష్య‌త్ కాలెండ‌ర్‌తో పాటు, హెచ్‌సీఏకు ప్ర‌శ్న‌ల‌ను సంధించారు. హెచ్‌సీఏ లీగ్‌కు బీసీసీఐ అనుమ‌తి లేదు హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ నిర్వ‌హిస్తున్న తెలంగాణ టీట్వంటీ లీగ్‌కు బీసీసీఐ నుంచి అనుమ‌తి లేద‌ని, టీసీఏ ఆరోపించింది. ప‌ర్మిష‌న్ ఉన్న‌ట్టు అబ‌ద్దాలు చెబుతూ, అంద‌రిని త‌ప్పుదొవ ప‌ట్టిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఇప్ప‌టికైనా, ఇలాంటి చౌక‌బారు ప్ర‌క‌ట‌న‌లు చేయోద్ద‌ని హిత‌వు ప‌లికారు. హెచ్‌సీఏ నిర్వ‌హిస్తున్న లీగ్‌లో చాలా అవ‌క‌త‌క‌వ‌లు జ‌రుగుతున్నాయ‌ని, జిల్లాల ఆట‌గాళ్లు కేవ‌లం…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

ఈ షా మీకు కొత్త‌…..క్రికెట్‌కు కాదు

నచ్చితే షేర్ చేయ్యండి

పృథ్వీ షా….అండ‌ర్ – 19 వ‌ర‌ల్డ్‌క‌ప్ టైటిల్‌ను టీమిండియాకు అందించిన కుర్రాడు. విరాట్ కోహ్లీలా…ఒక్కటంటే ఒక్క ఓట‌మి కూడా లేకుండా టీమ్‌ను విశ్వ‌విజేత‌గా నిలిపిన యంగ్‌గ‌న్‌. అలాంటి ప్లేయ‌ర్ గురించి ఇప్పుడు హాట్‌హాట్‌గా డిస్క‌ష‌న్ జ‌రుగుతోంది. ప్ర‌పంచ‌క‌ప్ ఆరంభ‌మైంది మొద‌లు….అంద‌రి చూపు ఈ కుర్రాడి మీదే ప‌డింది. బ్యాట్‌తో ఎన్ని ప‌రుగులు సాధిస్తాడ‌నే దానికంటే, కెప్టెన్‌గా ఒత్తిడిని త‌ట్టుకోని ఎలా నిల‌బ‌డ్తాడ‌నేది ఇంట్రెస్ట్‌ను పెంచింది. అంద‌రి అంచ‌నాల‌ను అందుకోని టీమ్‌ను జ‌గజ్జేత‌గా నిలిపాడు. 14యేళ్ల‌కే రికార్డ్ స్థాయిలో 546 ప‌రుగులు పృథ్వీ షా ముంబైకి చెందిన ఆట‌గాడు. ముంబైలో మిడిల్ క్రికెట్ గ్రూప్‌తో పాటు, రిజ్వి స్ర్పింగ్ ఫీల్డ్‌, ముంబై అండ‌ర్ -16కి ఆడుతున్నాడు. 2013 న‌వంబ‌ర్‌లో రిజ్వి స్ర్పింగ్‌ఫీల్డ్ టీమ్ త‌ర‌పున బ‌రిలోకి దిగిన షా….కేవ‌లం 330బంతుల్లోనే 546ప‌రుగులు చేశాడు. ఇండియ‌న్ స్కూల్ హిస్ట‌రీలో ఇది…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More