అన్నా…రెండు టీట్వంటీ ఫ్రీ టిక్కెట్లు కావాలి..!

నచ్చితే షేర్ చేయ్యండి

అన్నా….రెండు రెండు టిక్కెట్లు కావాలి. ఉప్ప‌ల్ రాజీవ్ గాంధీ అంత‌ర్జాతీయ స్టేడియంలో ఇప్పుడు ఎక్క‌డ చూసినా విని‌పిస్తున్న మాట‌. ఎంట్రీ గేటు ద‌గ్గ‌రి నుంచి సెక్ర‌ట‌రీ ప్రెసిడెంట్ రూమ్స్ చుట్టూ మాత్ర‌మే కాదు…ఈసీ మెంబ‌ర్స్ వ‌ర‌కు అంద‌రి ద‌గ్గ‌రికి ఇలాంటి సిఫార‌సులే. ఐపీఎల్‌ మ్యాచ్‌ల త‌ర్వాత జ‌రుగుతున్న మ్యాచ్ కావ‌డం….అందునా అంత‌ర్జాతీయ మ్యాచ్ కావ‌డంతో ఈ స‌న్నివేశాలు వ‌రుస‌గా క‌నిపిస్తున్నాయి. సిఫార‌సుల‌కు హెచ్‌సీఏ చెక్‌ హెచ్‌సీఏలో కాంప్లిమెంట‌రీ పాస్‌లు ఇవ్వ‌డం అన‌వాయితీగా వ‌స్తోంది. మ్యాచ్‌ల‌ను క‌వ‌ర్ చేసే మీడియా ప్ర‌తినిధుల‌తో పాటు…పోలీసుల‌కు పొలిటిక‌ల్ లీడ‌ర్స్‌కు ఫ్రీగా టిక్కెట్లు ఇస్తారు. అయితే ఈ మ్యాచ్ నుంచి స‌రికొత్త ఆలోచన‌తో ముందుకొచ్చింది. టిక్కెట్లు ఫ్రీగా కావాలంటే….2000రూపాయాలు రూర‌ల్ క్రికెట్‌ డెవ‌ల‌ప్‌మెంట్ కోసం చెల్లించాలి. అలా చేసిన వాళ్ల‌కు ఎన్ని టిక్కెట్లు ఇస్తార‌నే దానిపై క్లారిటీ లేక‌పోయినా…దాదాపుగా కొంద‌రికి చెక్ పెట్టారు.…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More