ప‌డింది పంచ్‌..ఇక హైద‌రాబాద్‌లోనే క్లైమాక్స్‌

నచ్చితే షేర్ చేయ్యండి

రెండో టీట్వంటీలో టీమిండియాకి ఝ‌ల‌క్ ప‌డింది. ఆసీస్ బౌల‌ర్ల అద్భుత‌మైన బౌలింగ్‌కి తోడు, బ్యాటింగ్ ఆర్డ‌ర్‌లో చేసిన మార్పుల‌తో టీట్వంటీ సిరీస్ ఆస‌క్తిక‌రంగా మారింది. వ‌ర్షం అంత‌రాయం క‌ల్గిస్తుంద‌నుకున్న మ్యాచ్‌లో, మ‌న దూకుడికి ఆసీస్ క‌ళ్లెం వేసింది. టీట్వంటీలోనే స్పెష‌లిస్ట్‌గా పేరున్న ప్లేయ‌ర్స్ అంద‌రూ వ‌రుస‌గా పెవిలియ‌న్‌కు క్యూక‌ట్ట‌డంతో భార‌త్‌కు ఘోర ఓట‌మి త‌ప్ప‌లేదు. త‌డ‌బ‌డి..నిల‌బ‌డ‌లేక‌ ప్ర‌త్య‌ర్థి ఆహ్వానం మేర‌కు బ్యాటింగ్‌కు దిగిన భార‌త్ ఆరంభంలోనే కుప్ప‌కూలింది. కొత్త పేస‌ర్ బెహ్ర‌న్‌డార్ప్ దాటికి స్టార్ బ్యాట్స్‌మెన్ వ‌రుస‌గా డ‌గౌట్‌కు చేరుకున్నారు. జాద‌వ్ కాసేపు మెరిసినా, పాండ్యా, కుల్దీప్ నిల‌బ‌డ్డ‌ట్టు కనిపించినా, బెహ్ర‌న్‌కు తోడుగా జంపా రాణించ‌డంతో భార‌త్ 118ప‌రుగుల‌కే ఆలౌటైంది. టీట్వంటీలో ఇటీవ‌ల కాలంలో భార‌త్ సాధించిన అతి త‌క్కువ స్కోర్ ఇదే. ఛేజింగ్‌లో త‌డ‌బాటు.. 119ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే మ‌న పేస‌ర్లు…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

ఎడ‌మ‌చెత్తో తిప్పేస్తే….118ర‌న్స్‌కే ఆలౌట‌య్యారు

నచ్చితే షేర్ చేయ్యండి

ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న రెండో టీట్వంటీ సిరీస్‌లో భార‌త్ 118 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ప్ర‌త్య‌ర్థి ఆహ్వానం మేర‌కు బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీసేన‌, ఆరంభంలోనే నాల్గు కీల‌క వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. ఓపెన‌ర్లు రోహిత్, శిఖ‌ర్ ధావ‌న్‌తో పాటు కోహ్లీ, పాండే సింగిల్ డిజిట్‌కే పెవిలియ‌న్ చేరారు. ఈ నాల్గు వికెట్ల‌ను ఆసీస్ కొత్త బౌల‌ర్ బెహ్ర‌న్‌డార్ప్ ద‌క్కించుకున్నాడు. దీంతో…భార‌త్ 27ప‌రుగుల‌కే 4వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. ఈ టైమ్‌లో జ‌త‌క‌లిసిన ధోనీ, జాద‌వ్ కాసేపు టీమ్‌ను ఆదుకున్నారు. వీరిద్ద‌రూ ఆసీస్ బౌల‌ర్ల స‌హ‌నాన్ని ప‌రీక్షించారు. అయితే, జంపా ఎంట్రీతో సీన్ మారింది. వీళ్లిద్ద‌రూ త‌క్కువ స్కోర్ వ్య‌వ‌ధిలోనే పెవిలియ‌న్ చేర్చాడు. పాండ్యా భారీ సిక్స‌ర్‌తో ఆశ‌లు రేపినా కేవ‌లం 23ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. బౌల‌ర్ కుల్దీప్ యాద‌వ్ 16స్కోర్‌తో రాణించారు. దీంతో….భార‌త్ 118ప‌రుగుల‌కు ఆలౌటైంది.

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

ఆడింది చాలు….రిటైర్మెంట్‌పై నెహ్రా హాట్ డెసిష‌న్‌

నచ్చితే షేర్ చేయ్యండి

అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు ఆశిష్ నెహ్రా. ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న టీట్వంటీ సిరీస్‌లో అనుహ్యంగా స్థానం ద‌క్కించుకున్న నెహ్రా….అంతే ఆస‌క్తిక‌రంగా ఆట‌కు వీడ్కోలు ప‌లికేందుకు రెడీ అయ్యాడు. న‌వంబ‌ర్ 1న న్యూజిలాండ్‌తో జ‌ర‌గ‌నున్న టీట్వంటీ సిరీస్ తొలి మ్యాచ్‌తోనే క్రికెట్‌కు ముగింపు ప‌లికేందుకు ముహుర్తం ఖ‌రారు చేసుకున్నాడు. ఐపీఎల్ పుణ్య‌మా అని..ఆశిష్ నెహ్రా త‌న‌లోని ప్లేయ‌ర్‌ను లేటు వ‌య‌సులో అంద‌రికి ప‌రిచ‌యం చేశాడు. అత‌ని ఆట‌తీరుకు ఫ్యాన్స్ అంద‌రూ ఫిదా అయిపోయారు. చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు న‌మ్మ‌క‌మైన బౌల‌ర్‌గా మార‌డ‌మే కాదు….ధోనీ మ‌న‌సు గెల్చుకున్నాడు. అలా టీట్వంటీ టీమ్‌లోకి వ‌చ్చిన నెహ్రా….మ‌రోసారి ఫామ్‌ను చాటాడు. జ‌ట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన సీనియ‌ర్ ప్లేయ‌ర్‌గా నిలిచాడు. వీడ్కోలు కోస‌మే చాన్స్‌ ఆస్ట్రేలియాతో టీట్వంటీ సిరీస్‌కు నెహ్రాను ఎంపిక చేసిన‌ప్పుడు అంద‌రూ అవాక్క‌య్యారు. తొమ్మిది నెల‌ల త‌ర్వాత‌, అత‌న్ని ఆక‌స్మాత్తుగా ఎంపిక…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

ఎవ‌రీ బెహ్ర‌న్ డార్ఫీ….అలా కుమ్మేశాడు

నచ్చితే షేర్ చేయ్యండి

రెండో టీట్వంటీలో టీమిండియా టాపార్డ‌ర్ టాప్ లేపిన లెఫ్టార్మ్ పేస‌ర్ బెహ్ర‌న్‌డార్ఫ్‌పై ఇప్పుడు అంత‌టా హాట్‌హాట్‌గా డిస్క‌ష‌న్ మొద‌లైంది. రాంచి టీట్వంటీతో అంత‌ర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన డార్ఫ్‌…రెండో మ్యాచ్‌కే భార‌త టాప్‌క్లాస్ ప్లేయ‌ర్స్‌కు చెమ‌ట‌లు ప‌ట్టించ‌డ‌మే కాదు…అభిమానుల చేత ఔరా అనిపించాడు. వ‌రుస ఓవ‌ర్ల‌లో అత‌ను తీసిన నాల్గు వికెట్లు మ్యాచ్ స్వ‌రూపాన్నే మార్చేశాయి. 4ఓవ‌ర్లు…21ర‌న్స్‌…4 వికెట్లు బెహ్ర‌న్‌డార్ఫ్‌….ఆరంభ ఓవ‌ర్‌లోనే అర‌ద‌గొట్టాడు. రెండు బౌండ‌రీలు సాధించి ఫామ్‌లో క‌నిపించిన రోహిత్‌ను, వికెట్ల ముందు అదిరే బంతితో కంగారెత్తించాడు డార్ఫ్‌. అదే ఓవ‌ర్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీని కూడా వికెట్ల ముందు కంగారెత్తించాడు. డార్ఫ్ బౌలింగ్ దెబ్బ‌కు ఏకంగా….టీట్వంటీ కెరీర్‌లోనే ఫ‌స్ట్ డ‌కౌట్‌ను రుచిచూశాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన మ‌నీష్ పాండేను కూడా ఔట్ చేశాడు డార్ప్‌. ఇక‌, ఫామ్‌లో ఉన్నాడ‌నుకున్న శిఖ‌ర్ ధావ‌న్‌ను కూడా ఇన్‌స్వింగ్‌తో బొల్తాకొట్టించాడు.…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

ధోనీ హెలికాఫ్ట‌ర్ షాట్ చాలెంజ్‌లో సెహ్వాగ్‌

నచ్చితే షేర్ చేయ్యండి

  When in Ranchi, smack it like Dhoni! Watch the experts try to pull off helicopter shots, and catch #NerolacCricketLive NOW on Star Sports! pic.twitter.com/BwO8zOGYvZ — Star Sports (@StarSportsIndia) October 7, 2017

నచ్చితే షేర్ చేయ్యండి
Read More