టెస్ట్‌ల్లో మ‌ళ్లీ నెం.1గా టీమిండియా

నచ్చితే షేర్ చేయ్యండి

ఫస్ట్ టీట్వంటీలో గెలుపుతో జోష్‌లో ఉన్న టీమిండియాకు..వెరీ వెరీ వెరీ గుడ్‌న్యూస్‌. మ‌న జ‌ట్టు మ‌ళ్లీ టెస్ట్‌ల్లో నెం.1 ప్లేస్‌ను సాధించింది. టీట్వంటీల్లో గెలిస్తే టెస్ట్‌ల్లో నెంబ‌ర్‌వ‌న్ ఏంటి అనుకుంటున్నారా..? దానికి దీనికి రిలేష‌న్ లేకున్నా ఒకే రోజు మాత్రం ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. సౌతాఫ్రికా జ‌ట్టు, ఇంగ్లండ్ చేతిలో 1-2తో సిరీస్ కోల్పోవ‌డంతో భార‌త్ టెస్ట్‌ల్లో నెంబ‌ర్ వ‌న్ స్థానాన్ని ద‌క్కించుకుంది. టీమిండియా రీసెంట్‌గాను సౌతాఫ్రికాను 3-0తో ఓడించింది. దీంతో ఆ టైమ్‌లో భార‌త్ ర్యాంకింగ్స్‌లో రెండోస్థానానికి ఎగ‌బాకింది. ఇప్పుడు స‌ఫారీ జ‌ట్టు వ‌రుస‌గా రెండో సిరీస్ కోల్పోవ‌డంతో మొద‌టి స్థానాన్ని భార‌త్‌కు అప్ప‌గించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ మేర‌కు ఐసీసీ అధికారికంగా భార‌త్‌కు నెంబ‌ర్ వ‌న్ స్థానం ద‌క్కిన‌ట్టు ప్ర‌క‌టించింది. https://twitter.com/ICC/status/691967538037547008/photo/1

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

రైనాపై మాక్స్‌వెల్ సిక్స‌ర్‌…

నచ్చితే షేర్ చేయ్యండి

తొలి టీట్వంటీలో డ‌గౌట్‌కే ప‌రిమిత‌మైన మాక్స్‌వెల్, రైనాపై కౌంట‌ర్ వేశాడు. అత‌నాడిని ఇన్నింగ్స్‌పై కాకుండా, ఫాల్క‌న‌ర్ బౌలింగ్‌లో అత‌ను ప్ర‌వ‌ర్తించిన తీరుపై ట్వీట్ చేశాడు. అది కూడా మాములుగా కాదు..WELL PLAYED MAXI అంటూ రైనాపై సెటైర్ వేశాడు. దీనిపై ట్విట్ట‌ర్ వేదిక‌గా పెద్ద డిస్క‌ష‌నే జ‌రుగుతోంది ఇప్పుడు. అస‌లు ఇలా ఎలా అంటూ అంద‌రూ డిబేట్లు పెట్టుకున్నారు. ఫాల్క‌న‌ర్ వేసిన బంతిని లాస్ట్ మినిట్‌లో ఆడ‌లేనంటూ రైనా ప‌క్క‌కు త‌ప్పుకున్నాడు. అప్ప‌టికే బంతి డెలివ‌రీ కావ‌డం వికెట్ల‌ను ఎగ‌రేసుకు పోవ‌డం అంతా మినిట్‌లోనే జ‌రిగిపోయింది. అయితే, రైనా తాను ఇంకా రెడీగా లేన‌ని చెప్ప‌డంతో అంపైర్ కూడా నాటౌట్ ఇచ్చాడు. అయితే, ఈ తీరుపై మాక్స్‌వెల్ త‌న‌దైన స్ట‌యిల్లో స్పందించాడు. బాల్ డెలివ‌రీ అయ్యాకా రైనా కావాల‌నే త‌ప్పుకున్నాడ‌ని ఆరోపించాడు. మాక్స్‌వెల్ ఆ ఔట్‌కు సంబంధించిన…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

అడిలైడ్‌లో ఓ స్టాండ్‌కు కోహ్లీ పేరు…

నచ్చితే షేర్ చేయ్యండి

ఆస్ట్రేలియా టూర్‌లో అద్భుత‌మైన ఆట‌తీరుతో దూసుకెళ్తున్న విరాట్ కోహ్లీపై, కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ ఉహించ‌ని కామెంట్ చేశాడు. ఈ సిరీస్‌లోనే కాదు..వ‌రుస‌గా కోహ్లీ ఆట‌తీరు చూస్తుంటే భ‌విష్య‌త్‌లో ఇలాగే జ‌రుగుతుంద‌ని జోస్యం కూడా చెప్పాడు. ఈ మాట‌లు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాడు. కోహ్లీ గురించి ధోనీ ఇంత పాజిటివ్‌గా స్పందించడం కూడా క్రీడావ‌ర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఓ వైపు ఇది మంచి ప‌రిణామ‌మ‌ని అంటూనే మ్యాట‌ర్ ఏంటో క‌నుక్కునే ప‌నిలో ప‌డ్డారు. అడిలైడ్‌లో ఓ స్టాండ్‌కు త్వ‌ర‌లోనే ఆస్ట్రేలియ‌న్లు విరాట్ కోహ్లీ పేరు పెడ్తార‌ని మ్యాచ్ ముగిశాకా ధోనీ అన్నాడు. అత‌ను ఈ గ్రౌండ్‌లో 8 సెంచ‌రీలు చేశాడ‌ని, 2012 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అడిలైడ్‌లో కోహ్లీ ఎప్పుడు ఫ్లాప్ కాలేద‌న్నాడు. దాదాపు 90స‌గ‌టుతో కోహ్లీ రాణిస్తున్నాడ‌ని, అత‌ను అలాగే ఆడితే ఖచ్చితంగా ఆస్ట్రేలియ‌న్లే కోహ్లీ…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

స్మిత్‌ను కోహ్లీ ఎందుకు తిట్టాడంటే…

నచ్చితే షేర్ చేయ్యండి

ఫ‌స్ట్ టీట్వంటీలో చాలా మందికి పెద్ద‌గా అర్థం కాని మ్యాట‌ర్ ఏంటీ అంటే, కోహ్లీ, ఎందుకు స్టీవ్ స్మిత్‌ను తిట్టాడు అనేది. జ‌డేజా బౌలింగ్‌లో స్మిత్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకున్న త‌ర్వాత కోహ్లీ, తీవ్ర ఆవేశంతో స్మిత్‌ను తిట్టాడు. అదే టైమ్‌లో ఎదురుగా వ‌చ్చిన కోహ్లీకి కూడా మ్యాట‌ర్ గురించి వివ‌రించాడు. అంతేకాదు..ధోనీ నుంచి స‌పోర్ట్ అందుకున్నాకా స్మిత్‌పై త‌న మాట‌ల దాడిని కొన‌సాగించాడు. ఇదంతా కామెంటేట‌ర్స్‌తో స‌హా చాలా మందికి అర్థం కాలేదు. అయితే, మ్యాచ్ ముగిసిన త‌ర్వాత చాలా లేట్‌గా కోహ్లీ ఈ వ్య‌వ‌హ‌రంపై స్పందించాడు. స్మిత్‌ను ఆ టైమ్‌లో కాస్త త‌క్కువ‌గానే తిట్టాన‌ని, త‌న‌కు వ‌చ్చిన కోపానికి ఇంకా ఎక్కువ‌గానే అనాల్సి ఉంద‌న్నాడు. మ్యాచ్ జ‌రుగుతున్న టైమ్‌లో స్టీవ్ స్మిత్ ప్ర‌వ‌ర్త‌న అస‌లేం బాగాలేద‌న్న కోహ్లీ, ఇప్ప‌టికైనా స్మిత్ ఈ వ్య‌వ‌హ‌రంలో చాలా…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

ధ‌నాధ‌న్ లో ధోనీ గ్యాంగ్ బోణీ

నచ్చితే షేర్ చేయ్యండి

టీ20 సిరీస్ లో టీంఇండియా శుభారంభం చేసింది. ఆస్ట్రేలియాతో జ‌రిగిన తొలి టీ20 మ్యాచ్ లో 37 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. భార‌త్ ఆల్ రౌండ్ పెర్ఫార్మెన్స్ తో అద‌ర‌గొట్ట‌డంతో ఆసీస్ సొంత‌గ‌డ్డ‌పై తేలిపోయింది. భార‌త్ విధించిన 189 ప‌రుగుల టార్గెట్ ను ఛేదించ‌లేక ఆసీస్ 151 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. భార‌త బౌల‌ర్ల‌లో బుమ్రాకు 3, అశ్విన్, , జ‌డేజా, పాండ్యాల‌కు త‌లా రెండు వికెట్లు…నెహ్రాకు ఒక వికెట్ ద‌క్కింది. ఆసీస్ బ్యాట్స్ మెన్ లో కెప్టెన్ ఆరోన్ ఫించ్ 44 ప‌రుగులు చేసి రాణించ‌గా…స్మిత్ 21 ప‌రుగులు చేసి ఫ‌ర‌వాలేద‌నిపించాడు. ఆ త‌ర్వాత ఏ ఒక్క బ్యాట్స్ మెన్ కూడా నిల‌దొక్కుకోక‌పోవ‌డంతో ఆసీస్ 151 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది.

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

ఎనిమిదో వికెట్ అవుట్

నచ్చితే షేర్ చేయ్యండి

ఆస్ట్రేలియాకు గెలుపుపై ఉన్న ఒక్క ఆశాకిర‌ణం…జేమ్స్ ఫాల్క్ న‌ర్ కూడా అవుట‌య్యాడు. బుమ్రా బౌలింగ్ లో సిక్స‌ర్ కొట్టి ఊపు మీద క‌నిపించిన ఫాల్క్ న‌ర్ ..ఆ త‌ర్వాతి బంతికే అవుట‌య్యాడు. బుమ్రా అద్భుత‌మైన యార్క‌ర్ తో ఫాల్క్ న‌ర్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఆస్ట్రేలియా 143 పరుగుల వ‌ద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది.

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

ఏడో వికెట్ గా వేడ్ అవుట్

నచ్చితే షేర్ చేయ్యండి

ఆస్ట్రేలియా ఓట‌మి దిశ‌గా ప‌య‌నిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. 129 ప‌రుగుల వ‌ద్ద ఏడో వికెట్ కోల్పోయింది. పాండ్య వేసిన 17వ ఓవ‌ర్ తొలి బంతికి మాథ్యూ వేడ్ భారీ షాట్ కు ప్ర‌య‌త్నించ‌గా….బంతి డీప్ మిడ్ వికెట్ దిశ‌గా చాలా ఎత్తుకు లేచింది. అక్క‌డే ఫీల్డింగ్ చేస్తున్న జ‌డేజా క్యాచ్ ప‌ట్ట‌డంతో ఆసీస్ ఏడో వికెట్ ను కోల్పోయింది.

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

పాండ్యాకు వికెట్ ప‌డింది…

నచ్చితే షేర్ చేయ్యండి

వ‌రుస వైడ్ల‌తో అంద‌రికీ కాసేపు ఇరిటేష‌న్ తెప్పించిన యువ బౌల‌ర్ హార్దిక్ పాండ్య ఎట్ట‌కేల‌కు తొలి వికెట్ సాధించాడు. రెండు ఓవ‌ర్లు వేసిన పాండ్య 30 ప‌రుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. తొలి ఓవ‌ర్ లో ఐదు వైడ్లు వేసిన పాండ్య ..రెండో ఓవ‌ర్ లోనూ వైడ్ వేశాడు..ఐతే చివ‌రి బంతికి మాత్రం డేంజ‌ర‌స్ బ్యాట్స్ మ‌న్ క్రిస్ లిన్ ను పెవిలియ‌న్ కు పంపాడు…పాండ్య వేసిన బంతిని లిన్ భారీ షాట్ ఆడ‌గా….యువీ క్యాచ్ ప‌ట్ట‌డంతో అవుటయ్యాడు. దీంతో ఆసీస్ 124 ప‌రుగుల వ‌ద్ద ఆరో వికెట్ కోల్పోయింది.

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

పంచ్ ప‌డింది…

నచ్చితే షేర్ చేయ్యండి

ఆసీస్ ఐదో వికెట్ కూడా కోల్పోయింది. ప్ర‌మాద‌క‌ర ఆల్ రౌండ‌ర్ షేన్ వాట్స‌న్ కూడా అవుట‌య్యాడు. వాట్స‌న్ 12 ప‌రుగులు చేసి అశ్విన్ బౌలింగ్ లో అవుట‌య్యాడు. అశ్విన్ వేసిన బంతికి భారీ షాట్ కొట్ట‌బోగా…అది హెడ్జ్ తీసుకుని డీప్ ఫైన్ లెగ్ లో ఉన్న నెహ్రా చేతుల్లో వాలింది. ఆసీస్ 110 ప‌ర‌గుల వ‌ద్ద ఐదో వికెట్ కోల్పోయింది.

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

మూడు ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు

నచ్చితే షేర్ చేయ్యండి

హార్దిక్ పాండ్య ఓవ‌ర్లో 19 ప‌రుగులు పిండుకున్న ఆసీస్ కు ఆ ఆనందం ఎంతో సేపు నిల‌వ‌లేదు….త‌ర్వాతి మూడు ఓవ‌ర్ ల‌లో మూడు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. తొమ్మిదో ఓవ‌ర్ లో జ‌డేజా….స్మిత్ ను అవుట్ చేయ‌గా…. ఆ త‌ర్వాతి ఓవ‌ర్ లో అశ్విన్…ఆసీస్ కెప్టెన్ ఫించ్ ను ఎల్బీడ‌బ్ల్యూగా అవుట్ చేశాడు. దీంతో ఆస్ట్రేలియా 89 ప‌రుగుల వ‌ద్ద మూడో వికెట్ ను కోల్పోయింది. ఇక 11వ ఓవ‌ర్ లో జ‌డేజా మ‌ళ్లీ విజృంభించాడు. ఈ ఓవ‌ర్ చివ‌రి బంతికి జ‌డేజా…ట్రావిస్ హెడ్ ను పెవిలియ‌న్ కు పంపి భార‌త శిబిరంలో ఆనందం నింపాడు.

నచ్చితే షేర్ చేయ్యండి
Read More