స‌చిన్ టీమ్‌..ఓడెన్‌, సిరీస్ చేజారెన్‌

నచ్చితే షేర్ చేయ్యండి

క్రికెట్ ఆల్‌స్టార్స్ సిరీస్‌లో స‌చిన్ బ్లాస్ట‌ర్స్ వ‌రుస‌గా రెండో మ్యాచ్‌లో ఓడింది. వార్న్ వారియ‌ర్స్  పూర్తిగా డామినేట్ చేసిన పోటీలో స‌చిన్ బ్లాస్ట‌ర్స్ 57ప‌రుగుల తేడాతో ఓడిపోయి సిరీస్‌ను చేజార్చుకుంది. వార్న్ వారియ‌ర్స్ బ్యాట్స్‌మెన్ దూకుడైన ఆట‌, బౌల‌ర్ల డామినేష‌న్ బ్లాస్ట‌ర్స్ టీమ్‌ను కంగారెత్తించ‌డ‌మే కాదు, మ్యాచ్‌లో విజ‌యం సాధించేలా చేశాయి. రెండు జ‌ట్ల మ‌ధ్య మూడో టీట్వంటీ ఈ నెల 14న జ‌ర‌గ‌నుంది. క్రికెట్ ఆల్‌స్టార్స్ సిరీస్‌లో ఇదే లాస్ట్ మ్యాచ్‌.

స‌చిన్ ఆహ్వానం మేర‌కు మొద‌ట బ్యాటింగ్ చేసిన వార్న్ జ‌ట్టు 5వికెట్లు కోల్పోయి 262ప‌రుగులు చేసింది. కుమార సంగ‌క్క‌ర 70, క‌లిస్ 45, పాంటింగ్ 41ప‌రుగుల‌తో రాణించారు. ఈ ముగ్గురు మొన‌గాళ్ల దూకుడికి, ఓపెన‌ర్లు మైక‌ల్ వాన్‌, మాథ్యూ హెడెన్ జ‌త‌క‌ల‌వ‌డంతో వార్న్ జ‌ట్టు భారీ స్కోర్ చేసింది. వార్న్ టీమ్ చేసిన 262ప‌రుగుల భారీ స్కోర్‌లో 21సిక్స‌ర్లు, 22బౌండ‌రీలున్నాయి. వీటి ద్వారానే 214ప‌రుగులు వారియ‌ర్స్ ఖాతాలో చేరాయి.

263ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన స‌చిన్ టీమ్‌..నిర్ణీత ఓవ‌ర్లు ముగిసేస‌రికి 8వికెట్లు కోల్పోయి 205ప‌రుగులు మాత్ర‌మే చేసింది. టాపార్డ‌ర్‌, మిడిలార్డ‌ర్ విఫ‌ల‌మైన టైమ్‌లో..లోయ‌ర్ ఆర్డ‌ర్ బ్యాట్స్‌మెన్ స‌చిన్ టీమ్ ప‌రువు కాపాడారు. షాన్ పొలాక్ కేవ‌లం 22బంతుల్లోనే 7సిక్స‌ర్లు ఫోర్‌తో 55ర‌న్స్ చేశాడు. అత‌నికి తోడుగా స్వాన్ రెండు ఫోర్లు, రెండు భారీ సిక్స‌ర్ల‌తో 22ర‌న్స్ చేశాడు. అయితే, అప్ప‌టికే సాధించాల్సిన ర‌న్‌రేట్ పెర‌గ‌డంతో స‌చిన్ బ్లాస్ట‌ర్స్ టీమ్‌కు ఓట‌మి త‌ప్ప‌లేదు.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts