బ్యాడ్మింటన్ లో… బ్యాడ్ డే

నచ్చితే షేర్ చేయ్యండి

హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ లో భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్లకు తొలి రౌండ్ లోనే షాక్ తగిలింది. ఒక్కొరంటే ఒక్కరు కూడా తొలి రౌండ్ ను దాటలేక ఇంటిదారిపట్టారు. వరల్డ్ నెంబర్ 2 సైనా నెహ్వాల్ ఈ టోర్నీ నుంచి తప్పుకోవడంతో సింధు, శ్రీకాంత్ పైనే అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఐతే ఆ ఆశలన్నీ మొదటి రౌండ్ లోనే ఆవిరవుతాయని ఎవరూ ఊహించలేదు. మహిళల సింగిల్స్ లో సింధు, పురుషుల సింగిల్స్ లో శ్రీకాంత్, అజయ్ జయరామ్, మహిళల డబుల్స్ లో జ్వాల-అశ్విని జోడి తొలి రౌండ్ లోనే ఓటమిచవి చూశారు.

స్పెయిన్ షట్లర్, టాప్ సీడ్ కరోలినా మారిన్ తో జరిగిన మ్యాచ్ లో సింధు చేతులెత్తేసింది. 17-21, 9-21 తేడాతో దారుణంగా ఓడింది. కేవలం 35 నిమిషాల్లోనే మ్యాచ్ ఫినిష్ అయిందంటే సింధుపై మారిన్ ఏ రేంజ్ లో ఆడిందో అర్థం చేసుకోవచ్చు.

ఇక పురుషుల సింగిల్స్ లో కిడాంబి శ్రీకాంత్ , చైనా ఆటగాడు టియాన్ హువాయ్ చేతిలో 16-21, 21-15, 22-24 తేడాతో పోరాడి ఓడాడు. మరో మ్యాచ్ లో అజయ్ జయరామ్…చెన్ లాంగ్ చేతిలో 17-21, 12-21 తేడాతో ఓటమి చవిచూశాడు.

మహిళల డబుల్స్ లో జ్వాలగుత్తా, అశ్విన్ పొన్నప్ప జోడి కూడా తొలి రౌండ్ లోనే నిష్క్రమించి…అభిమానుల ఆశలను నీరుగార్చింది. కొరియా జోడి క్యుంగ్ యున్, స్యుంగ్ చాన్ చేతిలో 12-21, 15-21 తేడాతో ఓటమిపాలైంది. దీంతో హాంగ్ కాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ లో భారత పోరాటం తొలి రౌండ్ లోనే ముగిసింది.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts