దీపికా కుమారికి ప‌ద్మ‌శ్రీ…

నచ్చితే షేర్ చేయ్యండి

భార‌త అర్చ‌రీ స్టార్ ప్లేయ‌ర్ దీపికా కుమారికు ప‌ద్మ‌శ్రీ అవార్డ్ ద‌క్కింది. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ప‌ద్మ అవార్డ్‌ల్లో దీపికా పేరు కాస్త లేట్‌గా తెర‌పైకి వ‌చ్చింది. అర్చ‌రీలో భార‌త్‌కు అద్భుత‌మైన విజ‌యాలు సాధించ‌డ‌మే కాకుండా..చాలా మందికి ఆద‌ర్శంగా నిలిచింది. అర్చ‌రీ వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో కాంస్యంతో పాటు, వ‌ర‌ల్డ్‌క‌ప్ స్టేజ్ టు లో ఏషియ‌న్ చాంపియ‌న్‌షిప్‌లో దీపికా కుమరి స‌త్తాచాటింది. లండ‌న్ ఒలింపిక్స్‌లోనూ దీపికా కుమారి ప్ర‌తి ఒక్క‌రికి ఆద‌ర్శంగా నిలిచింది.

రాబోయే రియో ఒలింపిక్స్‌లోనూ దీపికా కుమారి హాట్‌ఫేవ‌రేట్‌గా బ‌రిలోకి దిగుతోంది. ఈ స్టార్ ప్లేయ‌ర్‌కు ఇలాంటి పుర‌స్కారం ఎంక‌రేజ్‌చేసేదే. ఈ అవార్డ్ స్ఫూర్తితో దీపికా కుమారి మ‌రిన్ని విజ‌యాలు సాధించాన‌ని చెబుతోంది.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts