థ్యాంక్యూ TV9….యూ ఆర్ స్పెష‌ల్‌   

నచ్చితే షేర్ చేయ్యండి
టీవీ9….చ‌దువుకునే రోజుల్లో ఎలాగైనా అక్క‌డ ప‌నిచేయాల‌నే క‌సితో మొద‌లైన ప్ర‌యాణం. అప్ప‌టి నుంచే ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు మొద‌లుపెడితే 2012లో కానీ క‌ల నిజం కాలేదు. అప్ప‌టి నుంచి జులై 14, 2017వ‌ర‌కు నా ప్ర‌యాణం ఎన్నో అద్భుత క్ష‌ణాల‌కు చేర‌వ‌చేస్తూ కొన‌సాగింది. లైఫ్‌లో ఎన్నో మ‌ధుర‌స్మృతులు ఇక్క‌డే నాకున్నాయి. అందుకే, టీవీ9లాంటి సంస్థ‌ను ఏ ద‌శ‌లోనూ విడిచిపెట్టొద్ద‌ని కోరుకునే వాడిని. అంతేకాదు…నాకంటూ ఈ సంస్థ‌లో ఓ ప్ర‌త్యేక స్థానం సంపాదించుకున్నాను.
 IMG-20170614-WA0018
ఈ సంస్థ‌లో రావ‌డానికి నాకు స‌హ‌క‌రించిన నా ప్రాణ‌మిత్రుడు కార్తీక్ ప‌వ‌న్ గాదెకు ముందుకు నా థ్యాంక్స్‌. ఆ టైమ్‌లో న‌న్ను ఇంట‌ర్యూ చేసిన దినేష్ ఆకుల గారు, చంద్ర‌మౌళి గారు, కృష్ణారావు గారికి కూడా ఎప్ప‌టికీ విధేయ‌త‌తో ఉన్నాను. ఉంటా కూడా. డెస్క్‌లో స్పోర్ట్స్‌లో ఎన్నో ప్ర‌యోగాలు చేయ‌డానికి దినేష్ ఆకుల గారు 2014 వ‌ర‌కు, ఆ త‌ర్వాత చంద్ర‌మౌళి గారు నాకు చాలా ఫ్రీడ‌మ్ ఇచ్చారు. వారి న‌మ్మ‌కాన్ని త‌గ్గ‌ట్టుగానే న‌న్ను నేను నిరూపించుకున్నాను.
IMG-20170119-WA0018
అలాంటి సంస్థ‌లో రిపోర్ట‌ర్‌గా న‌న్ను నేను చూసుకోవాల‌ని చాలా క‌ల‌లు క‌న్నా. కానీ, అది పూర్తిస్థాయిలో కాక‌పోయినా, ర‌జ‌నీకాంత్ గారి స‌హ‌కారంతో చాలాసార్లు క‌నిపించాను. అలాగే వినిపించాను కూడా. ఆయ‌నకి ఎప్పుడూ కృత‌జ్ఞుడిని. ఇక కోఆర్డినేష‌న్‌లో ఉండే హ‌రిప్ర‌సాద్ అన్న‌కు కూడా చాలా థ్యాంక్స్‌. ఆయ‌న‌తో పాటు  ఉన్న ప‌ద్మ గారు, ఫ‌ణి, స‌తీష్‌, ప్ర‌సాద్‌ల‌తో పాటు, మొద‌ట్లో ఉన్న నాగేంద్ర‌లు ఎప్పుడూ స‌హ‌క‌రించేవారు. వీరితో పాటు స‌హ‌క‌రించిన లైబ్ర‌రీ  ప్ర‌సాద్ గారు అండ్ టీమ్‌, పీసీఆర్ మిత్రుల‌కు, యాంక‌రింగ్ టీమ్‌కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాద‌ములు.
 IMG-20161024-WA0029
ఇక్క‌డ ఎన్నో అనుభ‌వాలున్నాయ్‌. వీడియో ఎడిట‌ర్లు నేను రాసిన స్క్రిప్ట్‌కు దిద్దిన మెరుగులు మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా మారేలా చేశాయి. ఇందుకు ఆశోక్‌, సుధీర్‌, వ‌ర్థ‌న్‌, కిర‌ణ్‌, స‌త్య‌నంద్‌, విజ‌య్‌ల‌ను స్పెష‌ల్‌గా మెచ్చుకోవాలి. ఇక‌, గ్రాఫిక్స్‌తో నా అనుబంధం మ‌రువ‌లేనిది.  న‌రేంద‌ర్, వెంక‌ట్, లాంటి గ్రాఫిక్ డిజైన‌ర్లు ప్ర‌త్యేకం. కొత్త‌వాళ్లైనా..ర‌ఘు, భాను, సాయి, నామాలతో స్నేహం ఎప్ప‌టికి మ‌రువ‌లేనిది. ఇక‌, చేత‌న‌లాంటి ఓ మిత్రురాలు ఎప్పుడూ ఆద‌ర్శం. టీవీ9ని వీడినా..బ‌హుశా నాతో ఎప్పుడూ జ‌ర్నీ చేసేవి ఈ రెండు విభాగాలే కావొచ్చు. ఇక వాయిస్ ఓవ‌ర్ టీమ్ నా అక్ష‌రాల‌కు జీవం పోశారు. కెమెరామేన్ మిత్రులకి స్పెషల్ థ్యాంక్స్
నా డెస్క్ నాకు మ‌రో ఇల్లు. ఇక్క‌డే చాలా కాలం పాటు ఉన్నా. చివ‌ర‌న ఉండే ఆ రెండు కూర్చీలు, సిస్ట‌మ్స్ నాకు ఎంతో ప్ర‌త్యేకం. అక్క‌డ నేను చేసిన అల్ల‌రి భ‌రించిన వాళ్ల‌ను విడిచి వెళ్ల‌డం కాస్త క‌ష్ట‌మైన ప‌నే. కానీ, త‌ప్ప‌ని స‌మ‌య‌మిది. డెస్క్‌లో అంద‌రితో నాకు చెరిపివేయ‌లేని, చెరిగిపోని అనుబంధం ఉంది. అందుకే, ఏ ఒక్క‌రిని ఇక్క‌డ ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించ‌ను. ఎందుకంటే, ఒక్కొక్క‌రితో ఒక్కొ అనుబంధం. సీనియ‌ర్ సాంబు గారి నుంచి, మొన్న‌నే చానెల్ వీడిన ప‌వ‌న్‌, శివ‌ల వ‌ర‌కు చెర‌గ‌ని రిలేష‌న్ ఉంది. వాళ్లంద‌రూ నా మంచి కోసం ఇప్ప‌టికీ త‌ప‌న ప‌డుతుండ‌టం చూస్తుంటే, నిజంగా ఆశ్చ‌ర్య‌మే కాదు ఇంత‌కంటే ఓ స‌బ్ఎడిట‌ర్‌కు కావాల్సింది ఏముంది.
 IMG-20161220-WA0066
ఈ నిర్ణ‌యం సొంతగా తీసుకుంది కాదు. కానీ, ప‌రిస్థితులు అటువైపు ప్ర‌భావం చేశాయి. కానీ, నాన్న నేర్పిన మాటలు, చూపిన బాట‌తో ముందుకెళ్తున్నా. ఇక‌పై స్పోర్ట్స్ ఫ్రీ లాన్స‌ర్‌గా కెరీర్‌ను కొన‌సాగిస్తా. నా ప్ర‌యాణం నేర్పిన అనుభ‌వాల‌తో, మ‌రికొన్ని అనుభూత‌ల‌ను రుచిచూసేందుకు జ‌ర్నీని మొద‌లుపెడుతా. www.cricnkhel.com తొలి తెలుగు స్పోర్ట్స్ వెబ్‌సైట్‌తో స్పోర్ట్స్ జ‌ర్న‌లిస్ట్‌గా అంద‌రికి అందుబాటులో ఉంటా. ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌, యూట్యూబే నా చానెల్స్‌. మీ అంద‌రి ఆశ్వీరాదం ఉండాల‌ని కోరుకుంటున్నా.
స‌దా మీ ప్రేమ‌కు బానిస‌ను
                 “Be Sportive….Be a Sports Man”
వెంక‌ట్ రేగ‌ళ్ల‌
సీనియ‌ర్ స్పోర్ట్స్ క‌ర‌స్పాడెంట్‌
న్యూస్ టెలివిజ‌న్ అవార్డ్ గ్ర‌హీత‌
9966691192

నచ్చితే షేర్ చేయ్యండి

Related posts