క్రీడా స్ఫూర్తి లేన‌పుడు ఆడ‌టం ఎందుకు…?

నచ్చితే షేర్ చేయ్యండి

రియో ఒలింపిక్స్ లో ఓ క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తి మ‌రిచాడు. ఓడిపోయిన త‌ర్వాత ప్ర‌త్య‌ర్థి షేక్ హ్యాండ్ ఇస్తుంటే తిర‌స్క‌రించాడు. క్రీడాస్ఫూర్తి మ‌ర‌చి విజ‌యం సాధించిన ఎదుటి ఆట‌గాడిని అవ‌మానించాడు. ఈజిప్ట్ జూడోక‌ర్ షెహ‌బీ , ఇజ్రాయెల్ జూడోక‌ర్ సాసొన్ మ‌ధ్య జూడో హెవియెస్ట్ ఫ‌స్ట్ క్లాస్ మ్యాచ్ జ‌రిగింది. ఈ పోటీలో ఇజ్రాయెల్ ఆట‌గాడు విజ‌యం సాధించాడు. మ్యాచ్ లో గెల‌వ‌గానే ప్ర‌త్య‌ర్థికి షేక్ హ్యండ్ ఇవ్వ‌బోయాడు. కానీ ఈజిప్ట్ ఆట‌గాడు షెహ‌బీ త‌న చేయిని వెన‌క్కి తీసుకున్నాడు. రెఫ‌రీ క‌లుగ‌జేసుకున్నా అత‌ని మ‌న‌సు మార‌లేదు. క్రీడా స్ఫూర్తిని మ‌ర‌చి విజ‌యం సాధించిన ఆట‌గాడిని అవ‌మాన‌ప‌రిచాడు.

చ‌ర్య తీసుకోవాల్సిందే..
షెహ‌బీ తీరుపై జూడో ఫెడ‌రేష‌న్ మండిప‌డింది. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్ర‌వ‌ర్తించ‌డం హేయ‌మైన చ‌ర్య అని, ఇందుకు క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య తీసుకోవాల్సిందేన‌ని అభిప్రాయ‌ప‌డింది. మిగ‌తా ఆట‌ల సంగ‌తి ఎలా ఉన్నా జూడోలో మాత్రం ఇటువంటి సంఘ‌ట‌న చాలా అరుదుగా జ‌రుగుతుంద‌ని తెలిపింది.

ఇస్లాంను అగౌర‌వ‌ప‌రిచిన‌ట్టే..
ఇజ్రాయెల్ ఆట‌గాడి వాద‌న మాత్రం విచిత్రంగా ఉంది. ఇజ్రాయెల్ త‌ర‌పున ఆడి ఓడిపోతే ఇస్లాంను అవ‌మానించిన‌ట్టేన‌ట‌…కిల్ల‌ర్ (ప్ర‌త్య‌ర్థి)తో స‌ఖ్య‌త‌గా ఎలా ఉండాలి..? అంటూ ఓ మీడియాకు తెలిపాడు.

ఆల్ అల‌ర్ట్..
ఈ సంఘ‌ట‌న‌తో కోచ్ లంతా త‌మ ఆట‌గాళ్ల‌ను మ‌రో సారి అల‌ర్ట్ చేస్తున్నారు. ఆట‌లో గెలుపోట‌ముల సంగ‌తి ఎలా ఉన్నా క్రీడాస్ఫూర్తిని మాత్రం మ‌ర‌వొద్ద‌ని…యావ‌త్ ప్ర‌పంచ‌మంతా ఇటే చూస్తోంద‌ని, హుందాగా న‌డుచుకుని దేశ పరువును కాపాడాల‌ని సూచించారు.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts