ఆసీస్ పై భార‌త మ‌హిళా జ‌ట్టు గెలుపు

నచ్చితే షేర్ చేయ్యండి

రిప‌బ్లిక్ డే కు భార‌త మ‌హిళా జ‌ట్టు నుంచి ఇంత‌క‌న్నా గొప్ప కానుక మ‌రేమీ ఉండ‌దు…అన్ని పోటీల్లో మ‌హిళ‌లు రాణిస్తున్న వేళ‌…భార‌త మ‌హిళా క్రికెట్ జ‌ట్టు..ఆసీస్ మ‌హిళా జ‌ట్టుపై ఘ‌న విజ‌యం సాధించింది. అంతేకాదు భార‌త మ‌హిళా క్రికెట్ కు టీ20ల్లో ఇదే అత్య‌ధిక ప‌రుగుల ఛేజింగ్. ఈ గెలుపుతో మూడు టీ20ల సిరీస్ లో భార‌త మ‌హిళా జ‌ట్టు 1-0 ఆధిక్యం సాధించింది.

టాస్ గెలిచిన భార‌త మ‌హిళా జ‌ట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ …ఆసీస్ కు బ్యాటింగ్ అప్ప‌గించింది. ఆసీస్ 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 140 ప‌రుగులు చేసింది. భార‌త బౌల‌ర్ల‌లో పూన‌మ్ యాద‌వ్ కు 2 వికెట్లు ద‌క్కాగా…శిఖా పాండే, జుల‌న్ గోస్వామి, అనూజ పాటిల్ కు త‌లో వికెట్ ద‌క్కింది.

141 ప‌రుగుల టార్గెట్ ఛేజింగ్ భార‌త మ‌హిళా జ‌ట్టు దుమ్మురేపింది. మ‌రో 8 బంతులు మిగిలి ఉండ‌గానే టార్గెట్ ను ఛేదించింది. కెప్టెన్ మిథాలీ రాజ్ 4 ప‌రుగులే చేసి అవుట‌వ‌గా…హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ 46, వేద కృష్ణ‌మూర్తి 35 ప‌రుగుల‌తో రాణించి …భార‌త మ‌హిళా జ‌ట్టుకు విజ‌యాన్ని అందించారు. భార‌త ఉమెన్ క్రికెట్ చరిత్ర‌లో ఇదే అత్య‌ధిక ఛేజింగ్.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts