CRICKET

Its Ben Stokes…Stroke 14.5crores in Auction

ఇంగ్లండ్ ఆల్‌రౌండ‌ర్ బెన్‌స్టోక్స్‌, జాక్‌పాట్ కొట్టాడు. కాదు కాదు..అంత‌కుమించే దంచికొట్టాడు. రెండు కోట్ల‌తో ఇన్నింగ్స్ ప్రారంభించిన అత‌ను, 14.5కోట్ల‌కు దూసుకెళ్లాడు. అత‌న్ని ద‌క్కించుకునేందుకు ఢిల్లీ, ముంబై జ‌ట్లు పోటీప‌డితే, మ‌ధ్య‌లో వ‌చ్చిన పుణె ఓ రేంజ్ ఎమౌంట్‌ను ఇచ్చేసి సొంతం చేసుకుంది. అంతేకాదు..ఈ రోజ‌కిత‌డే కింగ్‌మేక‌ర్ అని నిరూపించుకునేలా చేసింది. ఒకే ఒక్క ధ‌ర‌తో వ‌ర‌ల్డ్‌క్రికెట్‌ను తిప్పుకున్నాడు బెన్‌స్టోక్స్‌.

ఐపీఎల్‌లో ఆక్ష‌న్‌కు క‌నీస‌ధ‌ర 2కోట్ల‌తో వ‌చ్చాడు బెన్‌స్టోక్స్‌. ఆల్‌రౌండ‌ర్ కోటాలో ఎవ‌రో ఒక‌రు ద‌క్కించుకోవ‌డం గ్యారెంటీ అని అంద‌రూ అనుకున్నారు. కానీ, ఈ స్థాయ‌లో రేటు ద‌క్కించుకుంటాడ‌ని మాత్రం ఎవ‌రు అనుకోలేదు స‌రిక‌దా, అస‌లు ఏంటీ ఇలా అత‌ని కోసం ఎగ‌బ‌డి ఫ్రాంచైజీలు పోటీప‌డ్డాయ‌నేది కూడా ఇంట్రెస్ట్‌ను పెంచింది. ఇంగ్లండ్ జ‌ట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌నే 2కోట్ల క‌నీస ధ‌ర‌కు అమ్ముడుపొతే, మిడిలార్డ‌ర్ బ్యాట్స్‌మెన్‌కు ఈ స్థాయి ధ‌రా అని అంద‌రూ ముక్కున వేలేసుకున్నారు.

ధోనీని కెప్టెన్సీ నుంచి త‌ప్పించిన పుణె రైజింగ్ టీమ్‌, బెన్‌స్టోక్స్‌కు అగ్ర‌తాంబులం ఇచ్చింది. అత‌ను ఆన్ ద ఫీల్డ్‌లో, అందునా టీట్వంటీ ఫార్మాట్‌లో ఓ రేంజ్‌లో ఇర‌గ‌దీస్తాడ‌నుకోవ‌డంలో డౌట్ లేదు, కానీ అంత‌కుముందే, అత‌ను ఆక్ష‌న్‌లో ఓ రేంజ్‌లో అంద‌రూ రియాక్ష‌న్ ఇచ్చేలా దూసుకెళ్ల‌డం మాత్రం మాములుగా కాదు ఇది ఓ న‌రికొత్త ట్రెండ్ అనేలా చేసేశాడు. మొత్తంగా..ఐపీఎల్ 10ఆక్ష‌న్‌లో పుణె జ‌ట్టు చేసిన మాయ‌, బెన్‌స్టోక్స్‌ను హీరోగా మార్చేసింది.

To Top